అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కళారంగ ప్రోత్సాహక పోటీలను నిర్వహిస్తున్నట్లు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు పేర్కొన్నారు. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మార్చ్ 7 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్య క్రమాల వివరాలు వెల్లడించారు. వాట్సాప్ సాధనం ద్వారా ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నాలుగు గంటలు సమయంలో నగరంలోని జర్నలిస్టు సోదరుల శ్రీమతి లేదా కుమార్తెలు మాత్రమే తమ ఎంట్రీలను పంపవచ్చని శ్రీను బాబు తెలిపారు. గీతాలాపన, రంగవల్లులు విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని శ్రీనుబాబు తెలిపారు. గీతాలాపన పోటీలో 10 నుంచి 15 సంవత్సరాలు లోపు వారిని జూనియర్స్ గాను, పదహారేళ్లు పైబడిన వారిని సీనియర్స్ గానూ పరిగణించ బడుతుందని తెలిపారు.
ఏదైనా చిత్రాల్లోని సాంప్రదాయ గీతాలను ఎంపిక చేసుకుని కేవలం రెండు నిమిషాలు నిడివిగల వీడియోను వాట్సాప్ కు పైన పేర్కొన్న సమయంలో మాత్రమే పంపవలసి ఉంటుంది. జర్నలిస్టు వివరాలను తెలియజేస్తూ పంపవలసి ఉంటుంది. న్యాయ నిర్ణీతలు ఎంపిక చేసిన పదిమందికి ఏడవ తేదీన వీ జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సత్కరించటం జరుగుతుందన్నారు. రెండు పోటీల్లో కూడా పాల్గొనేవారు తప్పనిసరిగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులై ఉండాలి. జూనియర్స్ తప్పనిసరిగా వయసును ధ్రువీకరించే పత్రాన్ని జోడించాలి. పాటల పోటీలు ఎంట్రీలను మహిళా ప్రభుత్వ కళాశాల టీచర్ నంబర్ డాక్టర్ కె వి.వేణి ఫోన్ నంబర్ 939 3114901, రంగవల్లులు ఎంట్రీ లకు సంబంధించి విజేఎఫ్ కార్యవర్గ సభ్యురాలు పి. వరలక్ష్మీ నంబర్ 9059308958 లలో సంప్ర దించాలని కోరారు.