విజయవాడ : నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు, రైతుకి గిట్టుబాటు ధర, వ్యవసాయ ఆధరిత
పరిశ్రమలలో యువ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు లక్ష్యంగా గ్లోబల్ ఫుడ్
బాస్కెట్(జీఎఫ్ టి) 2023 జాతీయ సదస్సు ఏప్రియల్ 28, 29 తేదీల్లో విజయవాడలో
నిర్వహించనున్నామని మాన్యుఫాక్చురర్స్ సర్వీసెస్, మార్కెటింగ్
ఎంట్రప్యన్యూర్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎమ్ ఎస్ ఎమ్ ఈ సి సి), వరల్డ్
అసోసియేషన్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (డబ్ల్యు ఏ ఎస్ ఎమ్ ఈ) సంస్ధ
నిర్వాహాకులు తెలిపారు..ఈ మేరకు గ్లోబల్ ఫుడ్ బాస్కెట్ జాతీయ స్ధాయి
కార్యక్రమ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, శాసన
సబ్యులు మల్లాది విష్ణు, ఏపీ ఎఫ్ పీసి కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఈఓ ఏపీ
ఫుడ్ ప్రోససింగ్ సోసౌటి శ్రీధర్ రెడ్డిలు ముఖ్య అతిధిగాలుగా పాల్గోని పోస్టర్
ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా విజయవాడ సెంటర్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత యువ పారిశ్రామికవేత్తలు వారి
ఆవిష్కరణలు స్వర్హధామమని అన్నారు. ఏప్రిల్ 28 29వ తేదీల్లో అంతర్జాతీయ గ్లోబల్
ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం జరగడం సంతోషదాయకమని విజయవాడలో జరుగుతున్న ఈ
కార్యక్రమానికి 20 దేశాల నుండి వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలు పలువురు
పాల్గొనడం శుభపరిణామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే వ్యవసాయ ఆధారిత
పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకారం వంటి కార్యక్రమాలకు
నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. విజయవాడలో
నిర్వహించనున్న ఈ గ్లోబల్ ఫుట్ బాస్కెట్ అంతర్జాతీయ సదస్సుకు ప్రభుత్వం తరఫున
కావాల్సిన సహాయ సహకారాలు తమ అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో ఎమ్ ఎస్ ఎమ్ ఈ సి సి చైర్మన్ దేవరాజ్, వైస్ చైర్మన్ శివానంద్,
డైరెక్టర్ టి. కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.