న్యూఢిల్లీ : నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు జరగనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. లక్షలాది జంటలను ఏకం చేసేందుకు మోగే బ్యాండ్ బాజాలు మార్కెట్ వర్గాలకు కొత్త శోభను తేనున్నాయి. ఈ దీపావళి పండుగ సీజన్లో తమ వ్యాపార కార్యకలాపాలు జోరుగా కొనసాగించిన ట్రేడ్ వర్గాలకు మరో బోనంజా. నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల పెళ్లి సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనుంది.
నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు జరగనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. లక్షలాది జంటలను ఏకం చేసేందుకు మోగే బ్యాండ్ బాజాలు మార్కెట్ వర్గాలకు కొత్త శోభను తేనున్నాయి. ఈ సీజన్లో దాదాపు 32లక్షల వివాహలు జరగనుండగా వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని సీఐఏటీ అంచనా వేసింది. ఆ సంస్థ రీసెర్చ్ విభాగం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అంచనాలను వెలువరించింది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని 4,302 మంది వర్తకులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించింది.
ఒక్క ఢిల్లీలోనే రూ.75వేల కోట్ల వ్యాపారం : ఈ సందర్భంగా సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఒక్క ఢిల్లీలోనే ఈ సీజన్లో 3.5లక్షల వివాహాలు జరగనున్నాయని, తద్వారా దాదాపు రూ.75వేల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది ఇదే సీజన్లో దేశంలో 25లక్షల వివాహాలు జరగ్గా రూ.3లక్షల కోట్లు మేర వ్యాపారం జరిగిందని తెలిపారు. ఈ పెళ్లిళ్ల సీజన్లో మార్కెట్లలో మొత్తంగా రూ.3.75లక్షల కోట్లు మేర ప్రవహించనున్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. వచ్చే వచ్చే పెళ్లిళ్ల సీజన్ జనవరి 14 నుంచి జులై వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.