దీని వల్ల ప్రతి యేటా ఎంతో మంది మృతి చెందుతున్నారు. క్యాన్సర్ లక్షణాలను
ముందస్తుగా గుర్తిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రాణాలు పోయే
ప్రమాదం ఉంటుంది. కణాల అనియంత్రిత పెరుగుదల ఉన్నప్పుడు క్యాన్సర్ అభివృద్ధి
చెందుతుంది. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే, దాని చికిత్స సాధ్యమవుతుంది.
కానీ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించకపోతే రోగిని నయం చేయడం కష్టం. మూత్రాశయ
క్యాన్సర్ వ్యాధి స్త్రీలు, పురుషులలో వేగంగా విస్తరిస్తోంది. మూత్రాశయ
క్యాన్సర్ 5 లక్షణాలు1. శరీరం ఒక వైపు నడుము నొప్పి ఉండటం. అయితే ఈ నొప్పి కొనసాగితే వైద్యున్ని
సంప్రదించాలి.
2. మూత్రంలో రక్తం, రక్తం గడ్డకట్టడం మూత్రాశయ క్యాన్సర్ ముఖ్యమైన లక్షణం.
దానిని నిర్లక్ష్యం చేయకూడదు.
3. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపించడం కూడా మూత్రాశయ
క్యాన్సర్ లక్షణం. దీన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు.
4. రాత్రిపూట మళ్లీ మళ్లీ మూత్ర విసర్జనకు వెళ్లడం. అయితే ఈ లక్షణం షుగర్,
కిడ్నీ రోగులలో కూడా కనిపిస్తుంది. కానీ ఈ లక్షణాలు మూత్రాశయ క్యాన్సర్
ఉన్నవారిలో కూడా కనిపిస్తాయి.
5. మూత్ర విసర్జన చేయాలని భావిస్తూ అలాగే ఉండిపోయినా, మూత్ర విసర్జన
చేయలేకపోయినా.. ఇబ్బందే. దీని కారణంగా మూత్రాశయం మీద అనవసరమైన భారం
పెరుగుతుంది. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించాలి.
కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదు అని నిపుణులు చెబుతున్నారు.