శ్రీసత్యసాయి జిల్లా : టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 600
కి.మీ చేరుకుంది.ఈ సందర్భంగా చిన్నయల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం
సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే
కార్యాచరణ ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ టెంపుల్ టూరిజం
సర్క్యూట్లో భాగంగా పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను
అభివృద్ధి చేయనున్నారు. టెంపుల్ టూరిజం సర్క్యూట్ పథకం అమలుతో ప్రత్యక్షంగా
పరోక్షంగా 6వేల మంది వరకూ ఉపాధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా
కటారుపల్లె వద్ద వేమన సమాధి, గొటిబాయిలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను,
చెర్లోపల్లి రిజర్వాయర్ బోటింగ్, బట్రేపల్లె వాటర్ ఫాల్స్ , శ్రీ ఖాద్రి
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో
ఆహ్లాదరకర వాతావరణం, రవాణా సౌకర్యాలు, యాత్రికులకు వసతి కోసం మౌలిక
సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకరంగం ప్రగతికి
దోహదపడవచ్చని అనేది లోకేష్ ఆలోచన. నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి
అవకాశాలు దొరుకుతాయి. మన సంస్కృతి, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని
పరిరక్షించడంతోపాటు టూరిజం ఆదాయం పెంచడం, స్థానికులకు ఉపాధి కల్పించడం
లక్ష్యాలుగా తలపెట్టిన ఈ టెంపుల్ టూరిజం సర్క్యూట్ని తెలుగుదేశం
ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించనున్నామని లోకేష్
ప్రకటించారు.