విజయవాడ : కరుణామయుడి పుట్టినరోజు..క్రైస్తవులందరికీ పండగ రోజు. దయామయుడు శాంతి సందేశాన్ని ప్రజలకు అందించే పాస్టర్లకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపా రు. మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం 806 మందికి పైగా పాస్టర్లకు క్రిస్మస్ కానుకలను లోకేష్ పంపించారు. పాస్టర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ ఇయర్ క్యాలెండర్, నూతన వస్త్రాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లు అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాస్టర్లకు లోకేష్ పంపిన క్రిస్మస్ కానుకలను అందించిన టిడిపి నేతలు వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపారు.