విశాఖపట్నం: నగరంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణానికి వర్చువల్
విధానంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన
చేయనున్నారు. అన్నవరం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల
విస్తీర్ణంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. దీనికి
సంబంధించి ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్
సమ్మిట్(జీఐఎస్–2023)లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒబెరాయ్ గ్రూప్ చేసుకున్న
ఎంవోయూ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్
హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అన్నవరంలో ఏర్పాట్లుపై
కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సమీక్షించారు. టూరిజం రీజనల్ డైరెక్టర్
శ్రీనివాస్ పాణి అన్నవరంలో ఒబెరాయ్‌కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
అన్నవరం వద్ద రూ.350 కోట్లుతో 7స్టార్ లగ్జరీ రిసార్టులను నిర్మించనున్నారు.