గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారులు
సజ్జల రామ కృష్ణా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి
వేణుమాధవ్, ఉపాధ్యక్షుడు పట్నాల సత్యనారాయణ , అధికార ప్రతినిధి పి సాయి కిరణ్
సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ విజయవాడ పట్టణంలోని
స్వర్ణకారులకు 350 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్ర కిషోర్ యోజన
లోన్లు జనవరి మొదటి వారంలో మంజూరు కి ఇండియన్ బ్యాంకు వారు ఆమోదం తెలిపి
ఉన్నారని, ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వడానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధిని
పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై సజ్జల రామకృష్ణారెడ్డి
తో వేణుమాధవ్ మాట్లాడారు.