వయోపరిమితి రెండేళ్లు పెంపు
అమరావతి: కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్.జగన్
మోహన్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తిమేరకు
వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంవల్ల
చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీ పడేందుకు అవకాశం లభిస్తోంది. పలు పోలీసు
ఉద్యోగాల భర్తీచేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు వీటి భర్తీకోసం
పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 6,100
కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి(మరో 411 ఎస్పై పోస్టులుకూడా నోటిఫికేషన్లో
ఉన్నాయి). వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్
ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో
సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ
చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.