టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు టైం దొరికితే చాలు తనకిష్టమైన ప్రదేశానికి ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటాడనే విషయం తెలిసిందే. అక్టోబర్‌లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి వెకేషన్ కు లండన్ వెళ్లాడు. టూర్ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట హల్చల్ చేశాయి. ప్రస్తుతం మరోసారి మహేశ్ బాబు టూర్ వేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కనిపించగా.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. మరి ఈ సారి మహేశ్ బాబు ఎక్కడికెళ్లాడనేది తెలియాల్సి ఉంది. షూటింగ్ షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉంటాడని అంతా అనుకుంటుండగా.. మహేశ్ బాబు వెకేషన్ ట్రిప్ వేయడంపై అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా ఎస్ థమన్ అండ్ టీం మెంబర్స్ దుబాయ్ కి వెళ్లారు. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్‌లో పూజాహెగ్డే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో పెళ్లి సందడి ఫేం శ్రీలీల సెకండ్ ఫిమేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. త్రివిక్రమ్ తొలిసారి ఐటెం సాంగ్ పెట్టబోతున్నాడని వార్తలు వస్తుండగా.. ఈ సాంగ్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా కనిపించనుందని జోరుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ క్రేజీ అప్డేట్లో నిజమెంత అనే విషయమై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.