విజయవాడ : క్రిస్మస్ పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులను క్రిస్టియన్ సోదర సోదరీమణులకు జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు, ఐజ గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దిన్ (ఐజా ) అందజేశారు. శనివారం భవానిపురంలోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందలాది మంది కి ఐజా ఈ కానుకలు అంద చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకులు ఐజా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని అన్నారు. కార్యక్రమంలో గయాజుద్దిన్ (ఐజా) మాట్లాడుతూ తాను గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయినా ఇచ్చిన మాట ప్రకారం గత నాలుగేళ్లుగా క్రిస్మస్ కానుకలను పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా క్రిస్మస్ కానుకలతో పాటు ప్రతి ఏటా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, హిందూ సోదరులకు సంక్రాంతి కానుకలను అందజేయడం జరుగుతుందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారం కోసం తన అహర్నిశం కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఠాగూర్ అజయ్ వర్మ, ఆలమూరు సాంబశివరావు, తాజ్ నోత్ మైనర్ బాబు, ఐజా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.