విజయవాడ : స్థానిక బావాజీపేటలోని సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏ.ఈ. ఎల్.సి మోడరేటర్ బిషప్ డాక్టర్ రెవరెండ్ పరదేశి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చర్చి వేలాదిమంది భక్తులకు ఆశ్రయ స్థానముగా ఆరాధించే స్థలముగా దేవుని కృప తో ఈ మందిరము దేవదేవుడు అనుగ్రహించిన ఈ ప్రశాంత మందిరంని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఏ.ఈ.ఎల్.సి మోడ రేటర్ బిషప్ లు యస్. జ.బాబురావు ,ఆర్.సి .ఎం. మువ్వల ప్రసాద్, లూథరన్ చర్చ్ చైర్మన్ జి.విజయ్ కుమార్ , పాస్టర్ పి. ప్రసాద్ రావు, చర్చ్ కౌన్సిల్ నెంబర్స్ మాట్లాడుతూ ఈ దేవాలయం అత్యంత పవిత్రమైన దేవాలయంగా ఎంతో మంది భక్తులు విచ్చేస్తుంటారని సత్యవాక్యం తో సంతోషం పొందుతారని, నమ్మకమని అన్నారు. సెంట్ పీటర్స్ యొక్క కౌన్సిల్ నెంబర్స్ డాక్టర్ బి.సంగీతరావు, బి .జాన్ రత్నం, పి.ప్రదీప్ పాల్, ఎన్.స్వరూప రాణి, జే.ఆనంద్ కుమార్, హరీష్ , పాస్టర్ ఆర్.వి. టి.ఆనందరావు, అడిషనల్ పాస్టర్ జీ.తామస్ ,ప్రేమ్ సాగర్ రెవరెండ్ డి. ప్రసాదరావు, తదితర పాస్టర్లు పాల్గొని దేవ దేవుని యొక్క కృపతో ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్ధన మందిరంని అనునిత్యం ఆధ్యాత్మికతతో వెలసిల్లాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో పలు దేవాలయ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.