అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) దళాలు ఘర్షణ పడి.. సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన క్రమంలో భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చైనా ప్రకటించింది.
దీనిపై సానుకూలంగా స్పందించిన చైనా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా-భారత్ సంబంధాల స్థిరమైన, పటిష్టమైన వృద్ధి దిశగా భారత్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
“చైనా-భారత్ సంబంధాల స్థిరమైన, పటిష్టమైన వృద్ధి దిశగా భారత్‌తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని ఉటంకిస్తూ ఏఎన్ వార్తా సంస్థ పేర్కొంది.
భారతదేశం, చైనా సైనిక కమాండర్ల మధ్య తాజా రౌండ్ చర్చల తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాల “స్థిరమైన, మంచి వృద్ధి” కోసం భారతదేశంతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని నిలబెట్టడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి డిసెంబర్ 20న భారత్, చైనా మిలిటరీ కమాండర్లు చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్లో ఇరుపక్షాల దళాలు జరిపిన మొదటి ఉన్నత స్థాయి చర్చలు డిసెంబర్ 9న జరిగాయి.
2022లో ప్రస్తుత పరిస్థితి, చైనా విదేశీ సంబంధాలపై ఒక సింపోజియంలో ప్రసంగిస్తూ, వాంగ్ ఇలా అన్నారు: ‘చైనా, భారతదేశం దౌత్య, సైనిక-మిలిటరీ మార్గాల ద్వారా కమ్యూనికేషన్‌ను కొనసాగించాయి. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని సమర్థించేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి… మేము చైనా-భారత్ సంబంధాల స్థిరమైన, పటిష్టమైన వృద్ధి దిశగా భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అన్నారు.