చెంచుమహిళలతో ముఖాముఖి..
శ్రీశైల క్షేత్రంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందడి చేశారు. సోమవారం ఆలయాన్ని ఆమె తన కూతురుతో కలిసి దర్శించుకొని భ్రమరాంబ, మల్లికార్జున స్వా మి, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పరివార దేవతలను దర్శించుకున్న రాష్ట్రపతి, గవర్నర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామి వారి శేషవస్ర్తాలు, పరిమళ విభూది, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం రూ.43.08 కోట్లతో ప్రసాద్ స్కీం కింద చేపట్టిన పలు శిలాఫలకాలను రాష్ట్రపతి ప్రారంభించారు. హఠకేశ్వరం, శిఖరేశ్వంలలో ఎమినిటీ సెంటర్, పుష్కరిణి, ప్రధానాలయంలో విద్యుద్దీకరణ, కృష్టవేణిరోడ్, యాంపీ థియేటర్, ఇల్యూమినేషన్ అండ్ సౌండ్ లైటింగ్ షో, డిజిటల్ ఇంటర్వెన్షన్ పార్కింగ్ ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్‌లు, సావనీర్ షాపులు, ఫుడ్కోర్ట్, ఏటీఎం అండ్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి చేరుకోగా, స్ఫూర్తికేంద్రం అధ్యక్షుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో గిరిజన చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు. స్ఫూర్తి కేంద్రంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తున్న సం క్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో టూరిజంశాఖ కార్యదర్శి అరవింద్‌సింగ్, ఏపీ టూరిజం ఎండీ అండ్ సీఈవో కన్నబాబు, చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ఉన్నారు.
కష్టాలు జయించాం..
‘జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యాభ్యాసం చేశాను. మా నాన్న కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలను జయించడం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాను’ అని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. స్ఫూర్తి కేంద్రంలో పది నిమిషాలపాటు గిరిజన మహిళలు, చిన్నారులతో మాట్లాడారు. భావిభారత పౌరులుగా ఎదిగేందుకు ప్రతి చిన్నారి విద్యార్థి దశ నుంచే దేశభక్తి అలవర్చుకోవాలన్నారు. తిరుగు ప్రయాణంలో నంది సర్కిల్ వద్ద కాన్వాయ్ నుంచి దిగి అభిమానులను పలకరించారు.
అదేవిధంగా చెంచు గూడెంలకు చెందిన గిరిజన మహిళ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని రాష్ట్రపతి కోరారు.