విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము 2023 సంవత్సరపు ఆలయ క్యాలండర్ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణా ధికారి దర్భముళ్ల భ్రమరాంబ , దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె. వి. ఎస్ కోటేశ్వరా రావు, ఎల్. రమాదేవి, సహాయ కార్యనిర్వాహణాధికారి బి. వెంకటరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల గురించి మీడియా నుద్దేశించి మాట్లాడారు.