ఏపీలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారా..? విభజన పాపం నుంచి ఆ పార్టీ బయట
పడగలుగుతుందా..? రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో పోటీ చేయబోతోంది..? ఇతర
పార్టీలతో కలిసి హస్తం పార్టీ పోటీ చేయబోతోందా..?. రాష్ట్ర విభజన తర్వాత
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ కీలక నేతలు సైతం
జంప్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. తాము హస్తం పార్టీ
నేతలమని చెప్పుకునేందుకు నేతలు ధైర్యం చేయడం లేదు. విభజన పాపం మొత్తాన్ని ఆ
పార్టీ మూటకట్టుకుంది. అనైతికంగా రాష్ట్రాన్ని విభజించారని ప్రజల్లో వాదన
ఉంది. 2014 ఎన్నికల్లో ఇదే అస్త్రంతో టీడీపీ, వైసీపీ పార్టీలు పోటీ చేశాయి. ఆ
ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ 60కిపైగా స్థానాల్లో
గెలిచింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. చాలా
చోట్ల నాలుగు, ఐదు స్థానాల్లో ఆ పార్టీ నేతలు నిలిచారు. దీంతో ఆ పార్టీ
కార్యక్రమాలు సైతం ఎక్కడా కనిపించలేదు.ఆ తర్వాత అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేసినా ప్రజల్లో ఆదరణ
దక్కలేదు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయింది.
2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావంచూపించలేకపోయింది. ఆ పార్టీ చీఫ్‌గా
రఘువీరారెడ్డి తప్పుకున్న తర్వాత నేతలెవరూ ముందుకు రాలేదు. చివరకు ఆ పదవి
శైలజానాథ్‌కు అప్పగించారు. ఆయన అప్పుడప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా
పోరాటం చేశారు. ప్రజల్లో ఉండేందుకు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అయినా
కాంగ్రెస్‌కు అంతా ఆదరణ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీకి
పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే
ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం
జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఏపీ కాంగ్రెస్
నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అగ్ర నేతలతో సభ,
సమావేశాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్
విడుదల చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో
ప్రజలకు వివరిస్తామంటున్నారు. ఇదే అస్త్రంతో ముందుకు వెళ్తామని అంటున్నారు.

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు : ఏపీకాంగ్రెస్ కి కొత్త
అధ్యక్షుడొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడి గా గిడుగు రుద్రరాజు
నుకాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్‌ను పీసీసీ చీఫ్ పదవి
నుంచి తప్పించి ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో
పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ
ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.