తిరుపతి : తమిళనాడు గవర్నర్ శ్రీ రవీంద్ర నారాయణ రవి కుటుంబ సమేతంగా గురువారం
సాయంత్రం అలిపిరి వద్ద గల టీటీడీ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించారు.
గో ప్రదక్షిణ మందిర నిర్మాణ దాత ఎ జె శేఖర్ ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు
స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు శ్రీ వేణుగోపాల స్వామికి పూజలు చేసిన
అనంతరం గో ప్రదక్షిణ చేసి, గోపూజ నిర్వహించారు. అనంతరం
గో తులాభారంలో పాల్గొని గోవుకు సమగ్ర దాణా అందించడానికి రూ 6600 గోశాల
డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డికి అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో దాత ఎ జె
శేఖర్ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని నిర్మింప చేయడం అభినందనీయమని, ఇలాంటి
ధార్మిక కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని గవర్నర్ అన్నారు.ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల : టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10 లక్షలు
విరాళంగా అందింది. చెన్నైకి చెందిన శ్రీ సి.సెంథిల్ కుమార్ అనే భక్తుడు తన
సంస్థ అయిన గ్రీన్ డెజిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈ విరాళం
అందించారు. ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
అన్నప్రసాద భవనంలో ఏఈఓ గోపినాధ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్
రవికుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.