న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు
దారితీశాయి. దాంతో బీజేపీ తన విమర్శలకు పదును పెట్టింది. కాంగ్రెస్
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం
చేతిలోనే నాయకత్వం ఉంటుందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు
చేశారు. దాంతో ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీకి
అస్త్రంగా మారాయి. ‘నిజం బయటకువచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ నేత చెప్పినట్లుగా
ఎవరు పార్టీ అధ్యక్షులు అయినా దాని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్
గాంధీ చేతిలోనే ఉంటాయి. మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడు లేక
రబ్బర్ స్టాంప్ అధ్యక్షులు అని పిలుద్దామా..? ఆయన గాంధీలు చెప్పిందే
చేస్తారు. కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు ఒక బూటకం’ అని బీజేపీ అధికార ప్రతినిధి
గౌరవ్ భాటియా విమర్శలు చేశారు.తాజాగా ఖుర్షీద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాంధీ
కుటుంబానిదే అని అన్నారు. ‘మా లీడర్ గాంధీ కుటుంబమే. ఎప్పటికీ వారే. ఖర్గే
పార్టీని నడుపుతారు. పార్టీ కార్యకలాపాలపైనే ఆయన దృష్టి సారిస్తారు’ అని
వెల్లడించారు. ఇటీవల ఈ నేత రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు. అతనో యోగి,
తపస్వి, మహాపురుషుడని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ రాముడి వంటివారు. కాంగ్రెస్
కార్యకర్తలంతా భరతుడి లాంటివారు. కొన్నిసార్లు రాముడు వెళ్లలేని చోటుకు భరతుడు
అతని పాదుకలను తీసుకెళ్లాడు. అలాగే, జోడోయాత్ర సందర్భంగా రాహుల్
ఉత్తర్ప్రదేశ్లో పర్యటిస్తున్నా, అన్నిచోట్లకూ స్వయంగా వెళ్లలేరు.
కాంగ్రెస్ కార్యకర్తలే భరతుడి మాదిరిగా ఆయన సందేశాన్ని రాష్ట్రమంతా
తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఖుర్షీద్ వెనక్కి తగ్గలేదు. తన
మాటలను సమర్థించుకున్నారు.