కోనసీమ : కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర
ద్వార దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఈ వైకుంట ద్వార
దర్శన ఏర్పాట్లను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామి
వారిని దర్శించికునేందుకు తరలివచ్చారు. ముక్కోటి సందర్భంగా తూర్పుగోదావరి
జిల్లా కడియం మండలం బుర్రిలంక కు చెందిన రత్నం రామారావు అద్భుతంగా పూల అలంకరణ
చేసారు. ఆలయ ప్రాంగణం అంతా బంతి,చామంతులతో పాటు బెంగళూరు నుంచి తీసుకొచ్చిన
ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు.తిరుమలేశుని ఆలయం మాదిరిగానే ఈ ఆలయాన్ని
పుష్పాలతో అలంకరించి అద్బుతంగా తీర్చిదిద్దారు.అంతేగాక స్వామి వారిని ఉత్తర
ద్వార దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు ఏడు స్వాగత ద్వారాలను ఏర్పాటు
చేసారు. ఈ ఎడాది కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ద్వారాలు భక్తులను విశేషంగా
ఆకట్టుకున్నాయి.ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరి
సత్యనారాయణ రాజుల ఆధ్వర్యంలో ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.