తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో
జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సాయంత్రం
శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి
రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో
అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సుబ్రమణ్యస్వామివారు కపిలతీర్థం పుష్కరిణిలో
ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర
నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు
భక్తి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు,
ఏఈఓ పార్థసారథి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.