వెలగపూడి సచివాలయం : వచ్చే ఏడాది మార్చి 3,4
తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023
వెబ్ సైట్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , రాష్ట్ర
పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐ.టి. శాఖల మంత్రి
గుడివాడ అమర్నాథ్ బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో
కలసి మంత్రులు ఇరువురూ ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023 బ్రోచర్ ను
ఆవిష్కరించారు. మంగళవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో జరిగిన
పాత్రికేయుల సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పాల్గొని
ఏపీ గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023 నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వారు
వివరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వాణిజ్యం, ఐ.టి.
శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి ఈ సమ్మిట్ లోగోను ఇప్పటికే ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ లోగోను అన్ని
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతోందని
తెలిపారు.
అదే విధంగా విశాఖ నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జి-20 సదస్సు, ఏప్రిల్ 24 మరో
జి-20 సదస్సు మరియు మూడు రోజుల పాటు అంతర్జాతీయ ఆరోగ్య సమ్మిట్, జనవరి 20,21
తేదీల్లో ఐ.టి. కాన్పరెన్సులు మరియు ఫిబ్రవరి 16,17 గ్లోబల్ టెక్సు సమ్మిట్
లను కూడా విశాఖలో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ సదస్సులను అన్నింటి
అనుసంధానం చేస్తూ దేశ, విదేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు ఈ ఏపీ
గ్లోబల్ ఇన్వెష్టర్స్ సమ్మిట్-2023 ప్రధాన వేదిక చేసుకోనున్నట్లు మంత్రి
తెలిపాయ. గత ఏడాది దావోస్ సదస్సు కు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా
హాజరయ్యారని, ఈ సదస్సులో జరిగిన పలు ఈ ఒప్పందాల్లో ఇప్పటికే రూ.40 వేల
కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ
పాత్రికేయుల సమావేశానికి ముందు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు,
పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖల అధికారులు, సి.ఐ.ఐ., కె.పి.ఎం.జి.
అధికారులతో మంత్రులు సమావేశమై సమ్మిట్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను
సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆర్.కరికల్ వలవన్, హ్యండ్లూమ్ & టెక్సటైల్స్ ప్రిన్సిఫల్ సెక్రటరీ
కె.సునీత, పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంచాలకులు డా.జి.స్రిజన, రాష్ట్ర సమాచార,
పౌర సంబరాల శాఖ ఇ.ఓ. సెక్రటరీ టి.విజయ్ కుమార్ రెడ్డి, పరిశ్రమ శాఖ
సెక్రటరీ సుందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.