అమరావతి : ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఏపీ ప్రభుత్వ
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో
మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై సభలు సరికాదన్నారు. ఈ నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘పోలీస్
యాక్ట్‌కు లోబడి ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. జరిగిన మారణకాండకు చంద్రబాబు
బాధ్యత వహించాలి. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. చంద్రబాబు
తీరును ప్రజలు గమనించాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ఆలోచించాలి.
నిబంధనలను బాబు పాటించి ఉంటే అమాయకులు చనిపోయేవారు కాదని సజ్జల అన్నారు.
చట్టాలను పట్టించుకోను ఏం చేస్తారో చేసుకోమని చందబ్రాబు అంటున్నారు. ఆయన సభలను
పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదు. నిబంధనలు పాటించాలని మాత్రమే పోలీసులు తెలిపారు.
చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు కనీస సంస్కారం లేదని సజ్జల
రామకృష్ణారెడ్డి అన్నారు.