విజయవాడ : ఉత్తరాంధ్ర అభివృద్ధి సంక్షేమం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని జనసేన
రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. యువశక్తి
కార్యక్రమ ప్రచారంలో భాగంగా మొదటి రోజు శనివారం 50 వ డివిజన్ లో దాసాంజనేయ
స్వామి గుడి లో పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక డివిజన్ అధ్యక్షులు
రెడ్డిపల్లి గంగాధర్, 55వ డివిజన్ అధ్యక్షులు సోమీ గోవిందుల ఆధ్వర్యంలో
ఇంటింటికి యువశక్తి కార్యక్రమాన్ని దాసాంజనేయ స్వామి వీధి, అబ్దుల్ ఖాదర్ వీధి
, జాడ పాపయ్య వీధి, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతలలో
ఇంటింటికి ప్రచారాన్ని పోతిన వెంకట మహేష్ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా
ప్రజలు అనేక సమస్యలను మహేష్ వద్ద ప్రస్తావించి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న
అన్యాయం పై వాపోయారు. గతంలో 700 రూపాయలు చెల్లించే ఇంటికి పన్ను నేడు 13వేల
రూపాయలు అయ్యిందని, చెత్త పన్ను చెల్లించకపోతే పథకాలు రద్దు చేస్తామని
వాలంటీర్లు బెదిరిస్తున్నారని, నిత్యవసర సరుకులు కొనుక్కునే పరిస్థితుల్లో
లేమని జగన్ పోతే తప్పించి మంచి రోజులు రావని మహిళలు తెలియజేశారు. పథకాల వల్ల
బిచ్చగాళ్లగా మారుతున్నామని, సొంతగా నిలబడలేకపోతున్నామని పథకాల వల్ల ఉపయోగం
లేదని, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలని జగన్మోహన్ రెడ్డి పాలనలో పెట్టుబడులు
పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2019
తర్వాత విస్తృతంగా కృషి చేస్తున్నారని అనేక ప్రాంతాలు పర్యటిస్తున్నారని
ఉత్తరాంధ్రలో ఈనెల 12 నిర్వహించే యువశక్తి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత
పాల్గొని విజయవంతం చేయాలని, ఉత్తరాంధ్ర కోసం పవన్ కళ్యాణ్, ఆయన కు అండగా
ఉత్తరాంధ్ర అని ఆ ప్రాంత ప్రజలు నినాదిస్తున్నారని పవన్ కళ్యాణ్ 2019 కి ముందు
నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడారని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై
పోరాడారని, గంగపూజ ఆచరించి గంగపుత్రుల సమస్యలపై గళం ఎత్తిరని, హుద్ హుద్
తుఫాన్ బాధితులకు అండగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు 50 లక్షలు
విరాళం అందించారని ఎన్నికల తదుపరి ఇసుక విధానం మార్చాలని భవన నిర్మాణ
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లాంగ్ మార్చి నిర్వహించారని, స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణ చేయవద్దని భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఇది ఆంధ్ర ప్రజల ఆత్మ
గౌరవమని, పోరాడారన్న విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ ముబీనా ,సాబింకర్ నరేష్,
నూనె సోమశేఖర్ ,పిల్లా. రవి దుర్గాప్రసాద్, మద్దిరాల కనకారావు,
కె. శంకర్,అనిత, రాజేంద్ర,రామారావు, మల్లెపు విజయలక్ష్మి, స్టాలిన్
శంకర్, పొట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి వెంకటరమణ, వేవిన నాగరాజు, నల్లబిల్లి
కనకారావు తదితరులు పాల్గొన్నారు.