జనవరి 9 నుంచి 14 వరకూ నెల్లూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న
వెంకయ్యనాయుడునెల్లూరు : భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జనవరి 9 నుంచి
14 వరకూ నెల్లూరులో పర్యటించనున్నారు. జనవరి 9న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో
చెన్నై నుంచి బయలు దేరి రైలు మార్గంలో గూడురు చేరుకుంటారు. గూడూరు నుంచి
రోడ్డు మార్గంలో వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకుని, అక్కడ బస
చేస్తారు. జనవరి 10న ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు సహా చుట్టు పక్కల గ్రామాలకు
చెందిన సందర్శకులను వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ లో కలుస్తారు. జనవరి 11న
ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకూ ఉదయగిరి, ఆత్మకూరులకు చెందిన సందర్శకులను
వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ లో ప్రత్యేకంగా కలుస్తారు. జనవరి 12న ఉదయం 10
గంటలకు స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని
పురస్కరించుకుని అక్షర విద్యాలయంలో ఉన్న వివేకానందుని విగ్రహానికి నివాళులు
అర్పించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులు,
విశ్వవిద్యాలయ పాత మిత్రులతో కలసి గడుపుతారు. జనవరి 13 ఉదయం 10 గంటలకు
వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని
ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్
నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. త్రిభాషా సహస్ర అవధాని వద్దిపర్తి
పద్మాకర్ సంక్రాంతి ప్రాశస్త్యాన్ని వివరిస్తారు. సాయంత్రం నెల్లూరు ట్రంక్
రోడ్ శివాజీ సెంటర్ లో గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. జనవరి 14 ఉదయం
నెల్లూరులోని కుమారుడి నివాసంలో భోగి పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం
పినాకిని ఎక్స్ ప్రెస్ లో చెన్నై బయలుదేరి వెళతారు.