విజయవాడ : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వినియోగదారుల వేడుకలు బందరు రోడ్డులోని
ఇండియన్ ఆయిల్ పైలెట్ సర్వీస్ స్టేషన్ ప్రాంగణంలో సోమవారం వైభవంగా జరిగాయి.
వినియోగదారుల సమక్షంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు
కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ యాజమాన్యం ఏడాది పొడవునా
పలు సందర్భాలని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం
ప్రశంసనీయం అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రతినిధులు చీఫ్ డివిజన్
రిటైల్ హెడ్ నరేంద్రమౌర్య, అనిల్, ఎన్.టి.ఆర్.జిల్లా సేల్స్ ఆఫీసర్
కె.వరప్రసాద్ పాల్గొన్నారు. వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఇండియన్
ఆయిల్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ
వస్తున్నదన్నారు. పైలట్ సర్వీస్ స్టేషన్ సంస్థ యజమాని ఎమ్.వి.వి. సత్యనారాయణ
మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు వాహనం కొనుగోలు తరువాత ముందుగా మరమ్మత్తుల
విషయం అటుంచి ఇంధన పొదుపుపై జాగ్రత్తలు, మెళుకువలు అవగాహన అలవరచుకోవాలని
కోరినారు. ఈ కార్యక్రమంలో ఎమ్. నందకిషోర్, సంస్థ మేనేజర్ కె.వెంకటప్పయ్యలు
వినియోగదారులకు స్వీట్స్ పంపిణీ చేశారు.