ప్రతి నలుగురిలో ఒకరికి సమస్య
శారీరక శ్రమ, వ్యాయామం ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. మధుమేహం,
క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శారీరక శ్రమ ఆరోగ్య
ప్రయోజనాలను అందిస్తుంది. మరీ ముఖ్యంగా, రెగ్యులర్ యాక్టివిటీ మీ జీవన
నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు.. నడక లేదా చిన్న చిన్న
వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ది. మెదడు చురుకుగా
పనిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కనీసం ప్రతి నలుగురిలో ఒకరికి
తగినంత శారీరక శ్రమ ఉండదని తేలింది. వ్యాయామంతో తమ సంబంధాన్ని
చక్కదిద్దుకోవడానికి తీసుకోగల దశలు చాలానే ఉన్నాయి. ఫిట్నెస్తో మంచి
స్నేహితులు కావడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఒక కొత్త జత లెగ్గింగ్స్ లేదా రన్నింగ్ షూలతో మిమ్మల్ని మీరు ట్రీట్
చేసుకోండి. జర్నలింగ్ చేయడం లేదా థెరపిస్ట్‌తో మాట్లాడడం శారీరక శ్రమ పట్ల
మానసిక స్థితిని మార్చడానికి సహాయపడుతుంది. “బరువు తగ్గడం” అనే లక్ష్యం
వ్యక్తిని ప్రేరేపించకపోతే బదులుగా వినోదాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నిపుణులు
సూచిస్తున్నారు. నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదైనా మిమ్మల్ని ఆరోగ్యంగా
ఉంచుతుంది. గంట కంటే ఎక్కువ సేపు కూర్చొని ఉండడం మంచిది కాదు.. ప్రతి గంటకు ఓ
ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుని నడవడం మంచిది.