ఏలూరు : ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ లోని ఆగిరిపల్లి లో నుతంగా నిర్మించిన
పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, సబ్ కలెక్టర్ ఆదర్శ్
రాజేంద్రన్, ఏలూరు ఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, స్థానిక వైస్సార్సీపీ
నాయకులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం ఉత్తమ ప్రతిభ
కనబరిచిన పోలీసులను, భవన నిర్మాణానికి సహాయం చేసిన దాతలను హోంమంత్రి తానేటి
వనిత గారు అభినందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ
ఆగిరిపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ పారదర్శకంగా, నిబద్ధతతో
పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ తీసుకొచ్చాక అనేక
సత్పలితాలను ఇస్తోందన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారిని మర్యాదగా,
నవ్వుతూ పోలీసులు పలకరిస్తున్నారు. రాష్ట్రంలో శిథిలావస్థలో వుండే పోలీస్
స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో
కార్పొరేట్ భవనాలను తలపించేలా పోలీస్ స్టేషన్లు తయారయ్యాయని పేర్కొన్నారు.
గతంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే ప్రజలు బయపడేవారని హోంమంత్రి వనిత
గుర్తుచేశారు.సీఎం జగన్ అధికారం లోకి వచ్చాక మహిళల రక్షణకు పెద్దపీట వేశారని హోం మినిస్టర్
తానేటి వనిత స్పష్టంచేశారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని హోంమంత్రి గారు
కొనియాడారు. రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కంప్లైంట్ ఇచ్చే విధంగా
జీరో ఎఫ్ ఐ ఆర్ ను తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్
కు వెళ్లి ఫిర్యాదు చేసే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. సీఎం జగన్
పాలనలో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాలకు
చేరుకున్నారని హోంమంత్రి తెలిపారు. మహిళా సాధికారత సాధ్యం అయ్యిందంటే దానికి
సీఎం జగన్ కారణమన్నారు. అంతేకాకుండా ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత సీఎం జగన్
కే దక్కుతుందన్నారు. గత సంవత్సరం హర్యానా లో జరిగిన చింతన్ శివిర్
కార్యకమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల హోం మినిస్టర్లు వచ్చారని, వారిలో తాను
ఒక్కరే మహిళా హోంమంత్రి అని తానేటి వనిత తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని
విధంగా మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చి దేశంలోనే గుర్తింపు ఇచ్చిన ఘనత జగన్ కే
దక్కుతుందన్నారు.