రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా
కడప : 79 వ రోజు న “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషాకు పూలమాలలతో, శాలువాతో సత్కరించి ఘనంగా
స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా రవీంద్ర
నగర్ సచివాలయం-5 పరిధిలోని మక్కా మజీద్ వద్ద నుండి “గడప గడపకు మన ప్రభుత్వం”
కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ 43 వ డివిజన్ పరిధిలోని
కార్పొరేటర్ ఏ. శ్రీలేఖ, ఇంచార్జి పి.రెడ్డి ప్రసాద్ ల ఆధ్వర్యంలో “గడప గడపకు
మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి, స్థానిక కార్పొరేటర్, నాయకులు, అధికారులతో కలిసి ఆయా
వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా
మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్
మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ
సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా
పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని
సంబందిత అధికారులకు రెఫర్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షమం, అభ్యున్నతే రాష్ట్ర
ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన
సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ
పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి
తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం జగన్
మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. కార్యక్రమంలో ప్రతి
కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి
కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.