చైర్మన్ గా కుసుమ లావణ్య దేవి, వైస్ చైర్మన్ గా ఆర్. అమూల్య కల్పన
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణ పురంలోని శ్రీ శారదాంబ మహిళా
సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి
వైవి కోటేశ్వరరావు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల
అథారిటీ ఉత్తర్వుల మేరకు జనవరి 16వ తేదీ స్థానిక ప్రశాంతి మున్సిపల్ ఎలిమెంటరీ
స్కూల్ నందు ఎన్నికలు నిర్వహించినట్లు, అలాగే ఎన్నికలు చైర్మన్ వైస్ చైర్మన్
డైరెక్టర్లుగా నియమితుల కొరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా కుసుమ
లావణ్య దేవి చైర్మన్ గా , ఆర్. అమూల్య కల్పన వైస్ చైర్మన్ గా , అలాగే బ్యాంక్
డైరెక్టర్లుగా జి .అపర్ణ, వి. నాగమణి, కే. లక్ష్మి కుమారి ,ఎం. జ్ఞానాంబ, పి
.రాధిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వివరించారు. శ్రీ శారదాంబ
మహిళా సహకార అర్బన్ బ్యాంక్ సీ.ఈ.వో. జి. ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎన్నిక
కాబడ్డ ఐదుగురు డైరెక్టర్లు, చైర్మన్ , వైస్ చైర్మన్ ఐదు సంవత్సరాల కాలం
బ్యాంకు అధికారులుగా కొనసాగుతారని అదే విధంగా ఇప్పటివరకు 28 కోట్ల 50 లక్షలు
డిపాజిట్లు ఉండగా 18 కోట్ల 60 లక్షలు అడ్వాన్సర్స్ ఉండగా మొత్తం నాలుగు వేల
ఆరువందల సభ్యులతో ఈ బ్యాంకు కొనసాగుతుందని ఈ ఐదు సంవత్సరాల కాలం ఈ మొత్తం
యొక్క బాధ్యత వీరు నిర్వహిస్తారని వివరించారు. ఎన్నికైన చైర్మన్ ,వైస్
చైర్మన్, డైరెక్టర్లకు , నియామక పత్రాలను ఎన్నికల అధికారి వై.వి.
కోటేశ్వరరావు, చక్రవర్తి, బ్యాంక్ సీ.ఈ.వో జి. ప్రభాకర్ రావు అందజేశారు.
బ్యాంక్ సభ్యులు, ఉద్యోగులు కొత్తగా ఎన్నికైన వారిని సత్కరించి కృతజ్ఞతలు
తెలిపారు.