ఖమ్మం : మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బిజెపి అస్తిత్వం ఖమ్మం సభతో పటా
పంచలు కానుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం
చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుండే ప్రారంభం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
వ్యవసాయ ప్రధాన ఎజెండా కే ప్రజలు జై కోడు తున్నారని ఆయన తేల్చిచెప్పారు. అది
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బి ఆర్ యస్ తోటే సాధ్యం అవుతుందని ప్రజలు
గుర్తించారన్నారు.దీనితో బెంబేలెత్తిపోతున్న మోడీ,అమిత్ షా ల ద్వయం సరికొత్త
కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 18 న ఖమ్మం లో తలపెట్టిన బి
ఆర్ యస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు. రాజ్యసభ సభ్యులు
బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్
రావు,తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ లతో కలసి ఆయన నేడు ఖమ్మంలో
మీడియాతో మాట్లాడారు.
దేశ రైతాంగం ఎజెండాయే బి ఆర్ యస్ ముందున్న కర్తవ్యం అని ఆయన తెలిపారు. అందుకు
తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న రైతుబందు,రైతుభీమా
పధకాలే తార్కాణమన్నారు.ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్,బిజెపి ల ఎలుబడిలో రైతులకు
ఒరిగింది శూన్యం అన్నారు.మోడీ మాయ జాలానికి కాలం చెల్లిందన్నారు సరికొత్త తరం
ప్రజల ఆకాంక్షలు నెర వేర్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్న లక్ష్యంగా ఆయన
చెప్పుకొచ్చారు. అందుకే బి ఆర్ యస్ ఆవిర్భావం అని ఆయన మరోమారు స్పష్టం చేశారు.
ఖమ్మం సభకు సర్వం సిద్దమని,ఈ సభకు హాజరయ్యే తెలంగాణా, ఛత్తీస్ ఘడ్,ఒరిస్సా,
ఆంద్రప్రదేశ్, రాష్ట్రాల ప్రజానీకానికి ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా అన్ని
ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు
బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్
రావు,తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.