32 వ డివిజన్ 229 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి మేలు చేయాలనే సంకల్పంతో
పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి అపూర్వ మద్ధతు
లభిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు
పేర్కొన్నారు. 32 వ డివిజన్ 229 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు
మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్
పాల్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సూర్య కాలనీ, సాయిబాబా టెంపుల్
రోడ్డు, గట్టా రత్తయ్య వీధులలో విస్తృతంగా పర్యటించి 230 ఇళ్లను సందర్శించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పిస్తూ.. సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా
ప్రజాప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు, హారతులతో బ్రహ్మరథం పట్టారు. గత
టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పేదలను దోచుకుందని మల్లాది విష్ణు
ఆరోపించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు
అందించే దిశగా అడుగులేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి
గ్రీవెన్స్ స్వీకరించారు. ట్రాక్ వెంబడి చెత్త తొలగించవలసిందిగా వీఎంసీ
సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు
పిచికారీ చేయాలన్నారు. కాల్వలపై దెబ్బతిన్న సిమెంట్ బిల్లలను మార్చాలని
సూచించారు. అలాగే ఎక్కడా లోఓల్టేజీ సమస్యలు రాకుండా చూడాలని విద్యుత్
సిబ్బందిని ఆదేశించారు.
సచివాలయ పరిధిలో రూ. 2.96 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 229 వ వార్డు సచివాలయ పరిధిలో 2 కోట్ల 96 లక్షల 65 వేల
758 రూపాయల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు
వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 155 మందికి క్రమం
తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 181
మందికి రూ. 25.34 లక్షలు, విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా 93 మందికి రూ. 8.83
లక్షలు., చేయూత ద్వారా 65 మందికి రూ. 12.18 లక్షలు., కాపు నేస్తం ద్వారా 14
మందికి రూ. 2.10 లక్షలు, వాహనమిత్ర ద్వారా 14 మందికి రూ. 1.40 లక్షలు., జగనన్న
తోడు ద్వారా 22 మందికి రూ. 2.20 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే
అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.