కదిరి : వేమన సామాజిక చైతన్యానికి స్పూర్తి అని, వారి పద్యాలు సమాజంలో చైతన్యం
తీసుకువచ్చాయని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆర్. కె.
రోజా పేర్కొన్నారు. గురువారం కదిరి నియోజక వర్గంలోని గాండ్ల పెంట మండలంలో
కటారుపల్లి శ్రీ యోగి వేమన సమాధిని, ఆలయాన్ని సందర్శించారు. అనంతరం జడ్పీ
హైస్కూల్ ఆవరణలో శ్రీ యోగి వేమన జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర
ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యోగి వేమన
చిత్రపటానికి పూలమాల వేసి, కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ బి గిరిజమ్మ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్,
ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, శంకర్ నారాయణ జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్,
రాయదుర్గం రెడ్ కార్పొరేషన్ చైర్మన్ భారతి, యోగి వేమన రెడ్డి సంఘం
ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా
యోగి వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం
విజయంతో కృషి చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రెడ్డి సంఘం
నాయకులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు
జరుపుకుంటున్న విశ్వకవి యోగివేమన జయంతి ఉత్సవాలను మరొక్కసారి గుర్తుచేసుకునే
విధంగా, భావి తరాలకు స్పూర్తి గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినందుకు
కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సుమారు 350 సంవత్సరాల క్రితం మహాకవి
వేమన పద్యాలు నేటికీ ఎంతో ప్రాచుర్యాన్ని పొందుతుండడం ఈ ప్రాంత ప్రజలు తమ
అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు సమాజంలోని రుగ్మతలను పార ద్రో
లెందుకు , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన పద్య రచన శైలితో యోగి వేమన
చైతన్యవంతం చేశారనీ, వేమన పద్యాలలో జీవిత నగ్న సత్యాలు నేటి తరం వారికి
స్ఫూర్తి దాయకంగా ఉన్నందున వేమన పద్యాల సారాంశ లను గ్రహించాలన్నారు. పిల్లలు
తమ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించుకోవాలి, నైతిక విలువల లాంటి విషయాలు
తెలుస్తాయన్నారు. తనకు సంస్కృతి సాంప్రదాయ శాఖ మంత్రిగా కేటాయించడం పట్ల
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణపడి ఉంటానన్నారు. యోగి వేమనఅందరివాడనీ
అభివర్ణించారు. యోగి వేమన చరిత్ర ను దశ దిశలా చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి ఈరోజు వేమన జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి
చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యోగివేమన జీవ సమాధి వద్ద అఖండ జ్యోతి
కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే వుంటాయని తెలిపారు. వేమన పద్యాలు లోక
నీతులని, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణమని తెలిపారు. వేమన స్పృశించని
అంశం లేదని, సమాజంలోని అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి చూసి వాటి
వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించారని తెలిపారు. సామాజిక, కుటుంబ
వ్యవస్థలలోని లోటుపాట్లు, సామాజిక అస్థవ్యస్థత, సామాజిక జీవనంలోని ప్రతి అంశం
మీద వేమన పద్యాలు చెప్పారని వారు చెప్పిన పద్యాలలోని సారాన్ని గ్రహించి
సామాజిక మార్పులు తీసుకు రావాలన్నారు. గాండ్లపెంట మండలాన్ని ఇకనుంచి శ్రీ
యోగి వేమన కటారు పల్లి మండలం గా నామకరణ చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు
చేయడం జరుగుతుంది తెలిపారు. కటారుపల్లికి తారు రోడ్డు పనులకు టెండర్లు పిలవడం
జరిగిందని. ఫిబ్రవరి మాసం నుంచి రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనులు
చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ లోక కవి మన
వేమన అని తెలిపారు. వేమన రచనలు ఆంగ్ల, ఐరోపా భాషలలో అనువదించడం జరిగిందని
తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలు వినని తెలుగు వారు లేరంటూ
అతిశయోక్తి కాదేమో. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే. మన వేమన మంచి కోసము,
మార్పు కోసము, మనకోసం ప్రశ్నించి, ప్రతిస్పందించి, ప్రతిధ్వనించారు. సమాజంలోని
అన్ని సమస్యల భిన్న కోణాల నుంచి ఆయన పద్యాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం వివిధ
వ్యక్తులు యోగి వేమన కీర్తిని ప్రశంసించారు. యోగి వేమన వంశస్థులు టి
వేమారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి
చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా
బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, పుర
ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.