ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా ఏళ్లుగా భావిస్తున్న సినీనటుడు,
వైసీపీ నాయకులు అలీకి ఆ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో అయినా ఛాన్స్
ఇస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి
వచ్చారు అలీ. టీడీపీ లేదా జనసేనలోకి వెళతారని భావించిన అలీ అనూహ్యంగా వైసీపీ
కండువా కప్పుకున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కీలక
పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆయనకు ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్
మీడియా సలహాదారు పదవి కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం. అలీకి వైసీపీ ప్రభుత్వం
చాలా చిన్న పదవి ఇచ్చిందనే చర్చ కూడా సాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ
చేయాలనే ఆలోచనలో ఉన్న అలీ జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని
అన్నారు. అలీకి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసే వైసీపీ నాయకత్వం దాదాపుగా
ఇవ్వకపోవచ్చు. అయితే ముస్లిం ఓట్లు ప్రభావం చూపే స్థాయిలో ఉన్న
నియోజకవర్గాల్లో అలీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆయనకు కలిసొచ్చే అవకాశం
ఉంటుందన్నది పలువురి అభిప్రాయం. నిజానికి గుంటూరు పట్టణంలోని ఓ నియోజకవర్గం
నుంచి పోటీ చేయాలని అలీ గతంలో అనుకున్నారు. కానీ వైసీపీ నాయకత్వం ఆయనకు ఆ
అవకాశం ఇవ్వలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా అలీ ఆశలు నెరవేరతాయా ? అన్నది
ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం అప్పుడే అభ్యర్థులను
ఖరారు చేసే పనిలో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ .. అలీకి పోటీ చేసే
అవకాశం ఇస్తారా ? అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాలం కలిసి వస్తే తనకు కూడా
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని అలీ భావిస్తున్నారు. సీఎం జగన్‌కు
ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పిన అలీ.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. వైసీపీ అధినేత
తనకు ఆ ఛాన్స్ ఇస్తారని బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో పోటీ
చేసే అవకాశం దక్కించుకోలేకపోయిన అలీకి.. వచ్చే ఎన్నికల్లో అయినా అలాంటి అవకాశం
దక్కుతుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.