రెండో వన్డేలో 108 పరుగులకు కివీస్ ఆలౌట్
రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 108 రన్స్‌కే కుప్పకూలింది.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టిక్నర్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. దాంతో 34.3
ఓవరల్లోనే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లు పదునైన
బౌలింగ్‌తో కివీస్ టాపార్డర్ కుప్పకూల్చారు. దాంతో పవర్ ప్లేలో ఆ జట్టు 4
వికెట్లు కోల్పోయి 15 రన్స్ మాత్రమే చేసింది. పేస్ ద్వయం షమీ, సిరాజ్‌కు
తోడు ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయడంతో ఆ
జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ వరుస
ఓవర్లలో రెండు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. ల్యూక్ ఫెర్గూసన్
(1), గ్లెన్ ఫిలిప్స్(36)ను ఔట్ చేశాడు. దాంతో కివీస్ 108 రన్స్‌కు ఆలౌట్
అయింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, హార్దిక్
పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ తలా ఒక వికెట్
తీశారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను షమీ తొలి ఓవర్లోనే
దెబ్బకొట్టాడు. ఐదో బంతికి ఫిన్ అలెన్(0ను బౌల్డ్ చేశాడు. ఓపెనర్
కాన్వే(7), డారెల్ మిచెల్ (1), నికోలస్(2), ఫిన్ అలెన్(0) విఫలమయ్యారు.
ఒకదశలో ఆ జట్టు 50 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందనిపించింది. 11 ఓవర్లకే
5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిని కివీస్ బ్రేస్‌వెల్,
ఫిలిఫ్స్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు 41పరుగలు సాధించారు.
ఫిలిఫ్స్, శాంటర్న్(27)తో కలిసి 47 రన్స్ జోడించాడు.