రోహిత్ హాఫ్ సెంచరీ
8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్‌తో రెండో వన్డే
మూడు వన్డేల సిరీస్ ఇండియా సొంతం
రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 109 పరుగుల టార్గెట్‌ను 20.1 ఓవర్లలోనే ఛేదించింది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (51) హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. అతను ఔటయ్యాక శుభ్‌మన్ గిల్ (36) కోహ్లీ (11), ఇషాన్ కిషన్ (8)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. రెండో వన్డేలో విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 108 పరుగులకు ఆలౌట్ అయింది. పేసర్ షమీ, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ 34.3 ఓవర్లలోనే ముగిసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత్‌కు శుభారంభం ఇచ్చారు. హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్, కివీస్ మీద ఒత్తిడి పెంచాడు. హిట్‌మ్యాన్, గిల్ తొలి వికెట్‌కు 72 రన్స్ చేశారు. షిప్లే బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు. బంతిని డిఫెండ్ చేయబోయిన అతను శాట్నర్ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.