విజయవాడ : గాంధీ నగర్ ఐలాపురం హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పశ్చిమ
రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పిడిఎఫ్ అభ్యర్థిగా బల్పర్చబడిన
ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న
గ్రాడియట్స్ ఓటర్లకు చదువుతున్న యువతకు ఒక సాధారణ బలహీన వర్గానికి చెందిన
వ్యక్తిగా రాష్ట్ర పరిస్థితుల్ని స్థితిగతుల్ని అంచనా వేసిన వ్యక్తిగా
చెప్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరుపై మీ అందరికీ
అర్థమవుతుంది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు
వేతనాలు సక్రమంగా ఇవ్వలేక పోతున్నారు. శాంతి భద్రతల వైఫల్యం నానాటికి
దిగజారుతుంది. కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది ఇటువంటి దౌర్భాగ్య
పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టివేయబడిందని యువత తమ బాధ్యతగా భావించి, ఇటువంటి
పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేవారు కమ్యూనిస్టు భావాజాల కల పిడిఎఫ్
అభ్యర్థిగా పోతుల నాగరాజ్ అనే నన్ను బలపరచమని అన్నారు. రాష్ట్రంలో దళితులు
మైనార్టీలు గిరిజన లు వారి సంక్షేమం గురించి గొప్పగా ముఖ్యమంత్రి చెప్పటమే
గాని పూర్తిగా వారి యొక్క సంక్షేమాన్ని అంచెలంచెలుగా నడ్డి విరుస్తూ ఉన్నారన్న
సంగతి విద్యావంతులు మేధావులు గ్రహించారని అన్నారు. ఇప్పుడు జరిగిన పరిపాలన
విధానం ప్రజానీకం గమనించారని అందరూ నోట ఒకటే మాట ఇలాంటి పరిపాలన రాజ్యాంగం
మొదలైనప్పుడు నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్న అనే మాట ఇటువంటి బాధాకరమైన
పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మేధావులు ఉద్యోగులు మంచి ఆలోచన విధానంతో ఈ
అధికార ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మీ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు
వినియోగించుకోవాలని అన్నారు. పిడిఎఫ్ బల పరిచిన వ్యక్తిగా పోతుల నాగరాజు గా
నేను కడప అనంతపురం కర్నూలు నియోజకవర్గంలో ఉన్న యువతకు, విద్యావంతులకు,
మేధావులకు ఉపాధ్యాయులకు విన్నవించుకునేది మానవ హక్కుల కాపాడుకోవాలి అంటే
అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాయలసీమ వెనుకబాటు తనానికి కారణం
రాయలసీమలో ప్రకృతి వనరులు దోచుకోవడానికి అధికార పార్టీ అవలంబిస్తున్న పరిపాలన
విధానం దౌర్జన్యం అధికార దుర్వినియోగం మేధావులు విద్యావంతులు ఇప్పటికే
గ్రహించారు కనుక పట్టభద్రులకు విద్యావంతులకు మేధావులకు డాక్టర్ పోతుల నాగరాజు
పిడిఎఫ్ అభ్యర్థిగా ఉన్న నన్ను బలపరిచి గెలిపించమని విన్నవిస్తున్నానన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగస్తుల జీతభత్యాలు వారి భద్రత కోసం రాయలసీమ
అభివృద్ధి కోసం సిపిఎస్ యొక్క రద్దు కోసం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరిటీ
కోసం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల టైం స్కేల్ అవలంబించడం కోసం మీ అందరి తరపున
ప్రశ్నించే గొంతునవుతానని కనుక రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్ని ధైర్యంగా
ఎదుర్కొనే వారు కమ్యూనిస్టు భావజాలాలు గల అభ్యర్థులే అని కనుక మేధావులు
విద్యావంతులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పరిస్థితుల్ని
చక్కదిద్దే , శాసనమండలిలో ప్రశ్నించీ, హక్కులు సాధించే వ్యక్తులను ఎంచుకొని మీ
ఓటుతో బలపరిచి పంపాలని అన్నారు.