విజయవాడ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
సందర్భంగా సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్, విజయవాడ నందు
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసిసి అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు మాట్లాడుతూ నేతాజీ స్వాతంత్య్ర సమర యోధులలో అగ్రగణ్యుడని,
స్వాతంత్య్ర సాధనకు అహింసా మార్గం ఒకటే సరిపోదని, పోరుబాట కూడా అవసరమని నమ్మిన
వ్యక్తి అని అన్నారు. దేశ స్వాతంత్య్ర సాధనలో నేతాజీ పాత్ర అనిర్వచనీయమైనదని
కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీసిసి కార్య నిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్
వలి, ఏపీసిసి ఉపాధ్యక్షులు ధనికుల మురళీమోహన్ రావు, జిల్లా అధ్యక్షులు
తాంతియా కుమారి, బొర్రా కిరణ్, ఏపీసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, నగర
కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహ రావు, ఏఐసిసి సభ్యులు బషీర్ అహ్మద్,
కొలనుకొండ శివాజీ, పొనుగుపాటి నాంచారయ్య, పిసిసి కార్యదర్శి మేడా సురేష్,
బైపూడి నాగేశ్వర రావు, పోతురాజు ఏసుదాసు, మహమ్మద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.