టెక్ మహీంద్రా తాజాగా సాధించిన అవార్డు ఇందుకు నిదర్శనం
టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ వెల్లడి.
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సాంకేతిక ప్రతిభను కలిగి ఉందని టెక్ మహీంద్రా ఎండీ
సీపీ గుర్నానీ ప్రశంసించారు. టెక్ మహీంద్రా సంస్థకు ఆంధ్రప్రదేశ్ నుంచి
అత్యుత్తమ ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతిదారుల రాష్ట్ర అవార్డు లభించిన నేపథ్యంలో ఆయన
ఏపీని అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.
“టెక్ మహీంద్రా సంస్థకు ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యుత్తమ ఐటీ/ఐటీఈఎస్ రాష్ట్ర
అవార్డు లభించడం ఎంతో హర్షణీయం. ఈ అవార్డు రాష్ట్రం యొక్క అద్భుతమైన సాంకేతిక
ప్రతిభను ప్రతిబింబిస్తోంది. అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రత్యేకం.” అని
గుర్నానీ ట్వీట్ లో ప్రస్తావించారు.
ఇన్ఫినిటీ వైజాగ్ 2023 సమ్మిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి
(50-100Cr కేటగిరి) కింద టెక్ మహీంద్రా లిమిటెడ్ ‘టాప్ 2 IT/ITES ఎగుమతిదారుల’
అవార్డును గెలుచుకున్నట్లు STPI (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా)
ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సీపీ గుర్నానీ ఈ ట్వీట్ చేశారు.
.@C_P_Gurnani, we thank you for recognising the talent #AndhraPradesh has and seek your continued support as we undo the ills of @jaitdp & @ncbn government and work towards achieving our state’s full potential under the dynamic leadership of @ysjagan.#HappeningAP #ProgressiveAP https://t.co/RP14nSZ5GG
— YSR Congress Party (@YSRCParty) January 24, 2023