ఆవిష్కరణగోరంట్ల-కొత్తపల్లి రహదరి నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన
బేతంచెర్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి
రూ.కోటిన్నర నిధులతో కాలక్షేప మండప పనులకు మంత్రి చేతులమీదుగా భూమిపూజ
అయ్యలచెరువు లో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి
బుగ్గన
బేతంచెర్లలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర
ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమాన్ని అందించడమే కాకుండా ఊరూరా అభివృద్ధి పనులు
చేపడుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.కోడుమూరు
మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.21కోట్లతో నిర్మిస్తొన్న హంద్రీ
నీవానదిపై హైలెవల్ వంతెనకు సంబంధించిన శిలాఫలకాన్ని మంగళవారం మంత్రి బుగ్గన
ఆవిష్కరించారు. గోరంట్ల గ్రామం నుంచి కొత్తపల్లి గ్రామం వరకు నిర్మించనున్న
రహదారికి సంబంధించి మంత్రి శంకుస్థాపన చేశారు.
బేతంచెర్లలో ప్రజలతో మమేకమైన మంత్రి బుగ్గన
డోన్ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వరుసగా రెండో రోజు
“గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. బేతం చెర్ల మండలంలోని నగర
పంచాయతీ 7వార్డులో ప్రజలతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పలకరిస్తూ వార్డులోని
ప్రతి గడపకు ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధిని, అందిన పథకాలని వివరించారు.
దానికి సంబంధించిన కరపత్రాలను స్థానిక ప్రజలకు అందజేశారు.
మంత్రి బుగ్గన చేతులమీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం
బేతంచెర్లలోని అమ్మవారిశాల ఆవరణలో చెన్నకేశవ ఆంజనేయ స్వామి కాలక్షేప మండపానికి
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ నిర్వహించారు. రూ.కోటిన్నర
నిధులతో మండపాన్ని నిర్మించే పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం
అయ్యలచెరువు లో నిర్మించిన మినిరల్ వాటర్ ప్లాంట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన
ప్రారంభించారు. అంతకు ముందు బేతంచెర్లలోని సాయిబాబా ఆలయాన్ని మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.
వంతెన శిలాఫలకం ఆవిష్కరించి రహదరి నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన కార్యక్రమంలో
కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్
పి.కోటేశ్వర రావు, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర
మేయర్ బివై.రామయ్య, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు
శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, కుడా
ఛైర్మెన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ సుబ్రమణ్యం తదితర ప్రజా
ప్రతినిధులు పాల్గొన్నారు.