175వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి
వెలంపల్లివిజయవాడ : అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ
శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 42వ డివిజన్ లోని
125వ సచివాలయం పరిధిలో 175వ రోజు బుధవారం గడప గడపకు మన ప్రభ్యుత్వం
కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా
ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ
పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి
తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ హెచ్ బి కాలనీలో ఈ రోజు
తిరిగింది పాత కాలనీ కావడంతో వర్ష కాలంలో మునిగిపోతుందనీ రానున్న రోజులలో
అభివృద్దికీ కృషి చేస్తామని తెలిపారు. పార్కుల అభివృద్ధి కి కృషి చేస్తామని
హామీ ఇచ్చారు. అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం
జరుగుతుందన్నారు. చివరి వ్యక్తి వరకు పథకాలు ఇస్తున్నామన్నారు. నగర
అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నగర అభివృద్ధికి సహకరిస్తున్నా జగన్
అన్నకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 42వ డివిజన్ కార్పొరేటర్
పడిగపాటి చైతన్య రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల
కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సచివాలయ సిబ్బంది
వాలంటీర్లు, నగరపాలక సంస్థ, రెవిన్యు, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.