అమరావతి:- 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జండాను ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ
ప్రజలకు హక్కులు కల్పించిన అత్యున్నత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును
గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవలే 75 ఏళ్ల
స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని
నిర్వహించుకున్నామని చెప్పారు. నైపుణ్యం గల పౌరులు, డిజిటల్ స్ట్రెంగ్త్,
ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారత దేశానికి ఉందని…వీటిని సవ్యంగా
వినియోగించుకోవడం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ మేటి దేశంగా మార్చవచ్చని
అన్నారు. యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు పాలసీలు తీసుకువచ్చి వాటిని
అమలు చేస్తే….ప్రపంచాన్ని జయించే శక్తిగా భారత్ మారుతుందని అన్నారు. ఇప్పుడే
‘విజన్-2047’ సిద్ధం చేసుకుని….ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడం
ద్వారా…దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి
భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల్లో 1 లేదా 2వ స్థానాలకు చేరుతుందని చంద్రబాబు
నాయుడు అన్నారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ వంటి విభాగాల్లో ఇప్పటికే ప్రపంచంలో
ఉన్నత స్థాయికి భారతీయులు చేరుకున్నారని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.
అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం 65 వేల డాలర్లు కాగా….ఇండియన్స్
తలసరి ఆదాయం 1,19,000 డాలర్లు గా ఉండడం మన దేశ పౌరుల సమర్థతకు నిదర్శనం అని
అన్నారు. గ్లోబల్ గవర్నెన్స్ లో భారతీయులు మరింతగా రాణించే అవకాశాలు ఉన్నాయి
అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాడు వచ్చిన ఐటీ విప్లవాన్ని అవకాశంగా
మార్చుకోవడం ద్వారా తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారని
చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పాలసీలు,
సంస్కరణల ఫలితాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పొందుతుందని చంద్రబాబు నాయుడు
అన్నారు. అవకాశాలు కల్పిస్తే…. తెలుగు ప్రజలు మరిన్ని అద్భుతాలు
సాధిస్తారని… ఇదే ఆలోచనతో 2029 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా
మార్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్దంగా పనిచేశామని
అన్నారు. అయితే తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం విధ్వంసాలతో సర్వనాశనం
చేసిందని అన్నారు. రాజ్యాంగ విరుద్ద, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర
భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. రాజ్యాంగం పరిరక్షింపబడినప్పుడే
ప్రజలకు న్యాయం జరుగుతుందని….రాజ్యాంగ పరిరక్షణ కోసం నాటి స్వాతంత్య్ర
ఉద్యమ స్ఫూర్తిగా నేడు రాష్ట్రంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేషన్
ఫస్ట్ (దేశమే ముందు) అనే సిద్దాంతంలో పౌరులు, ప్రభుత్వాలు పని చేయాలని
చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు
కంకణబద్ధులై పని చేయాల్సి ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు.