విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్
కోఆర్డినేటర్గా విశాఖపట్నంలో కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఎంపీ కెప్టెన్
ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా
ఎగురవేసి, పోస్టర్లు, కరపత్రాలు, డిజిటల్ మొబైల్ వ్యాన్లను విడుదల చేసి 2
గంటల పాటు పాదయాత్ర చేపట్టారు.సమావేశాన్ని, మీడియాను ఉద్దేశించి కెప్టెన్
ఉత్తమ్ ప్రసంగించారు. రాహుల్ గాంధీ సందేశాన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
వైఫల్యాలను మన కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే 2 నెలల పాటు ఈ కార్యక్రమంలో నాయకులందరూ చురుగ్గా పాల్గొనాలని ఆయన
కోరారు.