అమరావతి : ప్రభుత్వం అమలు చేసే అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమాజంలోని
అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని అప్పుడే రాజ్యాంగ స్పూర్తి పూర్తిగా
నెరవేరినట్టు అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే
మోషేన్ రాజు పేర్కొన్నారు. 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని
గురువారం వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వద్ద జరిగన గణతంత్ర దినోత్సవ
వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ముందుగా
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్భంగా
ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని ప్రాధమిక హక్కులు
అన్ని విధాలా సక్రమంగా అమలవుతున్నాయంటే అందుకు మన రాజ్యాంగం గొప్పదనమే
నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్పూర్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను
ప్రవేశ పెట్టి అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని
కలిగిన మన దేశం అన్ని రంగాల్లో ముందంజలో సాగుతోందంటే అందుకు కారణం రాజ్యాంగ
నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టించి రచించి మనకు అందించిన రాజ్యాంగమే
కారణమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజం అన్ని విధాలా అభివృద్ధి
చెందుతుందని జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహనీయులు కలలుగన్నఆశయాలను
నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో
విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని శాసన మండలి అధ్యక్షులు
కె.మోషేన్ రాజు పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రజలందరికీ
సమానంగా అందించేందుకు సియం చేస్తున్న కృషికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు
తెలిపారు. అదే విధంగా అభివృద్ధి సంక్షేమ పధకాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ
అందాలని అప్పుడే రాజ్యాంగ స్పూర్తి పూర్తిగా నెరవేరుతుందని తెలిపారు. దేశం ఈ
74 ఏళ్ళ కాలంలో అనేక రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధించగలిగిందంటే అందుకు కారణం
మన రాజ్యాంగ స్పూర్తే కారణమని తెలిపారు. ఈకార్యక్రమంలో శాసన సభ కార్యదర్శి
పి.బాలకృష్ణమాచార్యులు తోపాటు రాజకుమార్, జయరాజు,జగన్మోహన్ రావు తదితర ఉప
కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు,చీఫ్ మార్షల్ సహా పలువురు ఎస్పిఎఫ్ పోలీసు
సిబ్బంది, అసెంబ్లీకి చెందిన ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.