అమరావతి : ఈనెల 28న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం లో
పర్యటించనున్నారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30
గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ
శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో
పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం
సాగరమాల కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి
కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్ వద్ద గల విశాఖ ఎంపీ ఎం.వి.వి.
సత్యనారాయణ నివాసానికి వెళతారు. ఎంపీ కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు
శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు
ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో
ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి
నివాసానికి చేరుకుంటారు.