విశాఖపట్నం : మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ
మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత్‌కుమార్ స్వస్థలం
పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల. ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వసంతకుమార్ పని
చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్
రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్
కుమార్‌రెడ్డి హయాంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా 2009లో
రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వసంత్ కుమార్
పనిచేశారు. రోశయ్య క్యాబినెట్లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు. ఆ
తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
టీడీపీ- కాంగ్రెస్ కలయిక తర్వాత హస్తంపార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. 2014
నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ
మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వసంత్ కుమార్ భేటీ కావడంతో ఆ పార్టీలో
చేరుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. పవన్ కల్యాణ్‌తో తాను
రాజకీయాలేమీ చర్చించలేదని, మర్యాద పూర్వకంగానే తను కలిశానని చెప్పారాయన.వసంత్ కుమార్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర
విషాదంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రికి పెద్ద ఎత్తున అభిమానులు, అనుచరులు
చేరుకుంటున్నారు. వసంత్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య
నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి
తెలుపుతున్నారు. మరికాసేపట్లో.. వట్టి భౌతికకాయాన్ని సొంత గ్రామం పూండ్లకు
తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం
పూండ్లలో వసంత్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు
వెల్లడించారు.

వట్టి వసంతకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన
వట్టి వసంతకుమార్ కన్నుమూశారని తెలిసి చింతించానని జనసేన రాజకీయ వ్యవహారాల
కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. వసంత్
గ్రామీణాభివృద్ధి, పర్యటక శాఖల మంత్రిగా ఉన్నప్పుడు పలు పథకాలు అమలుపై
చర్చించే వాళ్ళం. అస్వస్థతతో ఉన్న ఆయన కోలుకుంటారనుకున్నాను. వసంతకుమార్
కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని జనసేన రాజకీయ
వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.