నెల్లూరు : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం,
బద్దెవోలు గ్రామంలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి
ఆయా కుటుంబాలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందిన సంక్షేమ
లబ్దిని తెలిపే బుక్లెట్ ను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అందించారు. ప్రతి
ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే, “గడప గడపకు మన
ప్రభుత్వం” కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన
హామీలను గడచిన 3 సంవత్సరాల కాలంలో నెరవేరుస్తూ, ఆ హామీలు క్షేత్రస్థాయిలో ఏ
విధంగా అమలు జరుగుచున్నవో తెలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా
“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి కాకాణి
వివరించారు.