హైదరాబాద్ : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీపీ
సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు
రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై
పార్టీ అధినేతతో ఎంపీలు చర్చించారు. విభజన సమస్యలు, పోలవరం, రాష్ట్ర ఆర్థిక
పరిస్థితి, జీవో నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ పరిస్థితి వంటి అంశాలపై పార్లమెంట్
లో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకు సూచించారు. సమావేశం లో మాజీ
ఎంపీ కంభంపాటి రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.