ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఎన్నికల సంఘం విధించిన ఐదేళ్ల పాటు అనర్హత వేటును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడా ఇమ్రాన్‌కు చుక్కెదురయ్యింది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆదేశాలను రద్దు చేయాలని ఇమ్రాన్ చేసిన విజ్ఞప్తిని ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి ఎన్నికల సంఘం ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఇమ్రాన్‌కు అక్కడ భంగపాటు ఎదురయ్యింది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆదేశాలను రద్దు చేయాలని ఇమ్రాన్ చేసిన విజ్ఞప్తిని ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో ఇతర దేశాల నుంచి స్వీకరించిన బహుమతులు, వాటి విక్రయ వివరాలను బహిరంగపరచలేదనే అభియోగాలపై పాక్ ఈసీ ఆయనపై ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేసింది.
తనపై ఐదేళ్ల అనర్హత వేటు వేస్తూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అతార్ మినాల్లా ప్రస్తుత పార్లమెంట్ కాలానికే ఈ అనర్హత వర్తిస్తుందని వచ్చే ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయకుండా ఇది అడ్డుకోదన్నారు. ఈ నేపథ్యంలో వాటిని అత్యవసరంగా రద్దు చేయాల్సిన అవసరం లేదని, పూర్తి డాక్యుమెంట్లతో మూడు రోజుల్లో మరోసారి పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారు.
ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన బహుమానాలను ఇమ్రాన్ ఖాన్ అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగాలు నిరూపితమయ్యాయని, ఎన్నికల ప్రమాణ పత్రంలోనూ ఇందుకు సంబంధించిన వివరాలు లేవని పేర్కొంటూ పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. అయితే, ప్రస్తుత కాలానికే ఈ అనర్హత వర్తిస్తుందని ప్రతిపక్ష పీటీఐ పార్టీ పేర్కొంటుండగా ప్రభుత్వం మాత్రం ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఇది అమలులో ఉంటుందని వాదిస్తోంది. ఈసీ ఇచ్చిన ఆర్డర్ కాపీలు విడుదల కాలేదని, దీంతో అనర్హత అంశంపై చాలా ప్రశ్నలున్నాయని ప్రతిపక్ష పీటీఐ పేర్కొంది.