భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
విజయవాడ : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా అఖిల
భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం
విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి
మాజీ శాసనసభ్యులు, ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి ముఖ్య
అతిధిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి
సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర చారిత్రాత్మకమైనదని, కుల, మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకే
తాటిపైకి తెచ్చేందుకు, భారత జాతి ఐక్యత కోసం చేపట్టిన యాత్ర అని అన్నారు.
బిజెపి ప్రభుత్వ కుల, మత విధానాల వలన ప్రజల్లో ఐక్యత లోపించిందని, రాహుల్
గాంధీ యాత్ర ద్వారా ఆయన లక్ష్యాలు ప్రజలకు తప్పకుండా చేరువవుతాయని,
భవిష్యత్తులో దీని ఫలితం ఖచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ
కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహ
రావు, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, ఎపిసిసి ఆర్టీఐ సెల్ చైర్మన్
పి. వై కిరణ్, పిసిసి కార్యదర్శి మేడా సురేష్, పొనుగుపాటి నాంచారయ్య తదితరులు
పాల్గొన్నారు.