ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం సృష్టించాయి.
టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు
రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు
పాల్పడి పారిపోయారు. గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి
చేరుకుని పరిశీలించారు. బాధితుడిని తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ అరవిందబాబు
ఆసుపత్రిలో పరామర్శించారు.